వన్స్ మోర్ 'నీలాంబరి'

By Staff

Ramya Krishna
'నరసింహ' సినిమాలోని నీలాంబరి పాత్రను మర్చిపోవటం కష్టమే. అందుకేనేమో ఆమె నటించిన ఓ డబ్బింగ్ చిత్రానికి సైతం ఆ పేరు పెట్టారు. ఇక ఇప్పుడు అదే పాత్రను మళ్ళీ ఆమె పోషించబోతోంది. అదీ ఓ టీవీ సీరియల్. నిజానికి రమ్యకృష్ణ టీవీ ఆర్టిస్టుగా చెయ్యటం మొదటసారి. అంతకు ముందామె యాంకర్ గా గేమ్ షోస్ చేసింది. ఆమె నటిస్తే ట.ఆర్.పి.రేటింగ్ లకు కొదవ ఉండదని భావించిన సన్ నెట్ వర్క్స్ వారు ఈ సీరియల్ నిర్మిస్తున్నారు. ఇక ఆ తమిళ సీరియల్ పేరు 'కలశం'.

ఈ సీరియల్ లో ఆమె డబుల్ రోల్ లో కనిపించనుంది. అందులో ఒకటి 'నరసింహ' సినిమాలో ని నీలాంబరి పాత్ర, మరొకటి మిడిల్ క్లాస్ అమ్మాయి గా కనిపిస్తుంది. సీరియల్ రంగంలో పేరొందిన కుట్టిపద్మిని ఈ సీరియల్ కి కథా రచన చేసారు. స్క్రీన్ ప్లే దేవీబాల, డైలాగులు జగన్ మోహన్ అందిస్తున్నారు. అలాగే యమ్.ఆర్.సెంధిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇక కుట్టిపద్మిని కూతురు కీర్తన, రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్ తో కలిసి ఈ సీరియల్ నిర్మిస్తోంది. అలాగే రమ్యకృష్ణ ఎపిసోడ్ కి రెండు లక్షలు చొప్పున తీసుకుంటోంది. త్వరలోనే ఈ సీరియల్ తెలుగులోనూ డబ్బింగ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X