లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో మరో అగ్ర హీరో.. ఈ కాంబినేషన్ అరాచకం!
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఖైది, మాస్టర్, విక్రమ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీద లోకేష్ కనగరాజ్ ఖైది, విక్రమ్ సినిమాలని సిరీస్ గా తెరకెక్కించారు. లోకేష్ యూనివర్స్ గా మార్చి అందులో ఈ కథలన్నీ భాగంగా ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో లోకేష్ లియో అనే సినిమా చేస్తున్నారు.
ఈ మూవీ కూడా లోకేష్ యూనివర్ష్ లో భాగంగానే సిరీస్ మూవీగా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 25% ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ అవార్డు వేడుకలో స్టార్ హీరో సూర్యతో కూడా ఒక మూవీ ఉంటుందని ప్రకటించారు. అలాగే ఆ సినిమాని 150 రోజుల్లో పూర్తి చేస్తానని లోకేష్ చెప్పారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీకి సంబందించిన చర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయంట. ఇప్పటికే రజినీకాంత్ కి లోకేష్ కథ కూడా చెప్పాడని టాక్. ఇక కోలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది అని సమాచారం. ఇక మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇక లోకేష్ యూనివర్ష్ సిరీస్ లలో భాగంగానే ఈ మూవీ కూడా ఉంటుందనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బింబిసార దర్శకుడితో సినిమా ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే ఇది ఎప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతుంది అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











