సాధారణంగా సినిమా వాళ్ళు ఎక్కువగా సెంటిమెంట్స్ ని నమ్ముతారన్నది తెలిసిందే .అలాగే సినిమా ఫ్లాఫు ,హిట్టులలో వాటికీ తగిన ప్రాధాన్యతనిస్తారు. అదే కోవలో తాజాగా రిలీజై పరాజయం పాలైన రజనీకాంత్ 'కథానాయుకుడు' సినిమా కి ఫ్లాఫు కారణాలు సెంటిమెంటు వైపు ప్రయాణిస్తున్నాయి. గత రజనీ చిత్రాలలో (శివాజీ,చంద్రముఖి,నరసింహా,ముత్తు) ఇంట్రడక్షన్ సాంగ్ ఎస్.పి.బాల సుబ్రమణ్యం పాడేవారు. ఇప్పుడు 'కుశేలన్' లో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ (సినిమా సినిమా పాట) శంకర్ మహదేవన్ పాడటమే ఫ్లాఫుకు కారణం అని తమిళ తంబిలు తేల్చేసారు. ఎందుకంటే బాబా సినిమాలో "డిప్పు డిప్పు" పాటని కూడా శంకర్ మహదేవన్ పాడటం ఆ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం కారణంగా చూపెడుతున్నారు. సర్లే అసలు మొదట 'కథానాయకుడు' ఆగస్టు 15న రిలీజ్ చేద్దామనుకున్నారు.అలా అయి ఫ్లాప్ అయితే బాబా కూడా ఆ రోజే రిలీజ్ చేసారు...అందుకే ఫ్లాపయింది అనేవారేమో...