మరో సారి మహేష్‌తో జతకట్టనున్న అనుష్క
రీసెంట్ గా రిలీజైన ఖలేజా చిత్రం ప్లాప్ అయినా అనుష్క, మహేష్ కాంబినేషన్ అదిరిందంటూ టాక్ వచ్చింది. అందుకేనేమో మరోసారి ఈ జంట జతకట్టడానికి రెడీ అవుతున్నారు. పందెం కోడి ఫేమ్ లింగు స్వామి దర్శకత్వంలో మహేష్ కమిటయిన చిత్రంలో ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో మహేష్ సోదరుడుగా మాదవన్ కనపిస్తూండగా, మరో కీలకపాత్రలో సమీరా రెడ్డి కూడా కనిపించి కవ్వించనున్నది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో ఆర్య హీరోగా చేస్తున్నాడు. తమిళంకు కూడా అనుష్కనే హీరోయిన్ గా చేయనుంది. సింగం(యముడు) చిత్రంతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న అనుష్కకి అక్కడ మార్కెట్ బాగా పెరిగింది. దాంతో ద్వి బాషా చిత్రాలకు ఆమెనే హీరోయిన్ గా ఎన్నుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా వేట అని నిర్ణయించారు. ప్రస్తుతం మహేష్ బాబు...శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపిస్తారు. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











