అనూష్క యేడేది డేట్స్ ఆ డైరక్టర్ కి
అనూష్క ఓ చిత్రానికి యేడేది పైగా డేట్స్ కేటాయించిదనే వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది.ఆమె రీసెంట్ గా సెల్వరాఘవన్ చిత్రం కమిటైంది.ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం.ఇక కమల్ హాసన్ తో విస్వరూపం ప్రాజెక్టు విషయంలో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటంతో కాదనుకున్న సెల్వ ఇప్పుడు మరోసారి తనను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు.అందుకే సూపర్ హిట్స్ ఇస్తున్న ఆర్య తోనూ,తమిళ్,తెలుగు భాషలకు సరిపడే అనూష్కతోనూ సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది.అదే కథ కనుక అయితే ఆ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు.అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది.రీసెంట్ గా తన అశోసియేట్ ని వివాహం చేసుకున్న సెల్వరాఘవన్ హానీమూన్ పూర్తి చేసుకువచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారు.ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయింది.తమిళంలోని ఓ పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి.


Click it and Unblock the Notifications











