డబ్బు పెంచాకే వేశ్యగా అనుష్క ఓకే అంది
'వేదం' సినిమాలో వేశ్య అమలాపురం సరోజగా నటించిన అనుష్క అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో ఈ చిత్రం రీమేక్ చేస్తూ ఈ పాత్రకు మొదట అనుష్కకు అడిగారు. అయితే తమిళంలో మొన్న సింగంతో దుమ్ము రేపిన తాను ఎంతవరకూ ఈ పాత్ర చేయవచ్చనే సందిగ్దంలో పడిందామె. అయితే రెమ్యునేషన్ ఆమెకు కమర్షియల్ చిత్రానికి ఇచ్చినంత ఇస్తానని నిర్మాత ఆర్ బి చౌదరి చెప్పటంతో ఆమె సరేననని చెప్పిందని సమాచారం. నిర్మాత మాత్రం అనుష్క అయితేనే పాత్రలో లీనమై మాటల్లోని విరుపులూ, చూపుల్లో జాణతనంతో జీవం పోస్తుందని భావించే ఇలా డబ్బు పెంచి తెచ్చానంటున్నరు. అలాగే ఆ భాషలోనూ జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ పోషించిన కేబుల్ రాజు పాత్ర అక్కడ శింబుకి దక్కింది. అనుష్కతో కలిసి నటించాలి అని శింబు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అతనికి ఆ అవకాశం దక్కింది. రాక్ స్టార్ పాత్ర తమిళంలో కూడా మంచు మనోజే పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











