షాకింగ్: కమెడియన్‌కు జోడీగా హీరోయిన్ అనుష్క?
చెన్నై: సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమెతో కలిసి చేయాలని పోటీ పడుతుంటారు. ప్రస్తుతం ఆమె రజనీకాంత్, అజిత్ సినిమాల్లో నటిస్తున్నారు. మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా ఉన్న ఆమె ఓ కమెడియన్ సరసన హీరోయిన్‌గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు. అతను మరెవరో కాదు...తమిళ స్టార్ కమెడియన్ సంతానం.
తమిళ దర్శకుడు రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో ఆర్య, సంతానం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్యకు సరసన తమన్నా, సంతానం సరసన తమన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడికానుంది.

ఇంత ముందు దర్శకుడు రాజేష్..ఆర్య హీరోగా బాస్ ఎన్గిర భాస్కరన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో సంతానం కమెడియన్‌గా నటించాడు. తాజా చిత్రంలో వీరిద్దరినీ హీరోలుగా పెట్టి సినిమా ప్లాన్ చేసాడు దర్శకుడు రాజేష్.
గతంలో సింగం 2 చిత్రంలో సూర్యకు జోడీగా నటించిన అనుష్క....అదే చిత్రంలో సంతానంతో కలిసి ఓ డ్యూయెట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సంతానంపై అనుష్కకు ముందు నుండీ మంచి అభిప్రాయం ఉంది. పైగా అతను స్టార్ కమెడియన్ కావడంతో అతనితో చేయడం వల్ల తన ఇమేజ్‌కు ప్రమాదమేమీ లేదని అనుష్క భావిస్తోందట.


Click it and Unblock the Notifications











