హాట్ టాపిక్: అనుష్కకి ఏ అవకరం?
తన చిత్రాల్లో ప్రధాన పాత్రలకు కన్ను వంకరో,కాలు వంకరో,మానసిక వైకల్యమో మరేమో పెట్టి సజీవంగా తీర్చిదిద్ది ప్రజెంట్ చేసే దర్శకుడు బాల.ఈ తమిళ దర్సకుడు దర్శకత్వంలో చేయటానికి రీసెంట్ గా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దాంతో ఇప్పుడు ఆమెకు ఏ అవకరం పెట్టనున్నాడు.సినిమాలో ఆమెను ఎలా చూపనున్నాడనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.అయితే తాను ఆమెను సజీవమైన పాత్రలో చూపించటానికి స్క్రిప్టుని రెడీ చేస్తున్నాను అంటున్నారు బాల.
ఇక రీసెంట్ గా అనుష్క తమిళంలో విక్రమ్ చిత్రం'నాన్న"లాయిర్ గా అద్బుతమైన నటన కనపరిచిందంటూ చెప్పుకున్నారు.దాన్ని మించే రేంజిలో ఓ విభిన్న తరహా లేడీ ఓరియెంటడ్ గా చిత్రాన్ని తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తాను..మీరే చూస్తారుగా అని నవ్వుతున్నాడు బాల.ఇక ప్రస్తుతం అనుష్క..ప్రభాస్ సరసన లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ చిత్రంలో చేస్తోంది.అలాగే నాగార్జున సరసన ఢమురకం చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం ఓ సోషియో ఫాంటసీ.ఈ రెండు చి్త్రాల అనంతరం ఆమె బాల దర్శకత్వంలోకి షిప్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











