అనూష్క ని అడ్డం పెట్టుకుని భూమిక బిజెనెస్
అనూష్క, భూమిక ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఈ స్నేహాన్ని పురస్కరించుకునే అనూష్క..భూమిక నిర్మించిన తకిట ..తకిట చిత్రంలో గెస్ట్ రోల్ లో చేసింది.అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే అనూష్కకు తమిళంలో ఉన్న మార్కెట్ ని భూమిక క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఇప్పుడా చిత్రాన్ని తమిళంలో నిర్మించనుంది. తాము ఉన్న సీన్స్ ను అలాగే ఉంచేసి ఎంజనత్తు కాదల్ టైటిల్ తో ఈ సినిమాని పునర్నించటానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ట్యాలెంట్ హంట్ ని పెడుతున్నారు. దాదాపు నలభై మంది ఆర్టిస్టులు తీసుకుని శ్రీహరి నాను నే దర్శకుడుగా పెట్టి పబ్లిసిటీ ప్రారంభించారు. ఇందుకోసం ఆడిషన్స్ ను కూడా నిర్వహించారు. కాలేజ్ లో జరిగే రొమాంటిక్ కామిడీగా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











