నిమిషానికి 5 లక్షలు వసూలు చేసిన అనుష్క
అనుష్క తాజాగా కార్తీ హీరోగా చేసిన శకుని చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తెరపై ఐదు నిమిషాలు మాత్రమే ఉండే ఆ రోల్ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఓ ఫన్ని పోలీస్ గా ఆమె చూసి చూడగానే కార్తితో ప్రేమలో పడే పాత్రలో కనిపించింది. అ తర్వాత ఆమె తన పెళ్లికి రమ్మని కార్తీని ఆహ్వానిస్తుంది. అయితే ఈ పాత్రకు గానూ ఆమె పాతిక లక్షలు వసూలు చేసిందని వినికిడి. అంటే నిమిషానికి ఐదు లక్షలు తీసుకుందన్నమాట.
తాజాగా ఆమె 'ఇరండామ్ ఉలగమ్'లో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా, రెండవది ఆటవిక యువతి పాత్ర. గృహిణిపాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళ మీడియా అంటోంది. ఈ చిత్రం బృందావనంలో నందకుమారుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనూష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అనుష్క ..నాగార్జున సరసన ఢమరకం చిత్రంలో కనపించనుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆర్.ఆర్.మూవీ మేరర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందలో అనూష్క పాత్ర ..అరుంధని పోలి ఉంటుందంటున్నారు. నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపించే ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధానపాత్రను పోషించనున్నాయి.
మరోపక్క కొరటాల శివ రూపొందిస్తున్న ప్రభాస్ తాజా చిత్రం 'వారధి'లో కూడా ఈ యంగ్ రెబల్ స్టార్‌తో రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాగార్జున తాజా చిత్రం 'ఢమరుకం'లోను 'అలెక్స్ పాండియన్'లో కార్తీ, 'తాండవం'లో విక్రంతోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











