Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కాలం కలిసొస్తోంది : అనూష్క
అనుష్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కెరీర్ సంతృప్తికరంగా సాగుతోంది. 'మిర్చి' ఘన విజయం సాధించటం, గుణశేఖర్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ ఇటీవలే ప్రారంభమవటం, సూర్యకు జంటగా మరోసారి అవకాశం రావటం నాకు కలిసొస్తున్న విషయాలని చెప్పింది.
భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్తూ...కహానీ రీమేక్ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా. ప్రస్త్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్ సినిమాలంటే తొలుత స్కిప్ట్ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.
ఇక నా పెళ్లి విషయంలో మా అమ్మా, నాన్నా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇందులో వాళ్ల ప్రమేయం పెద్దగా ఉండదు. నేను 'ఓకే' అన్నప్పుడే వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అంతే తప్ప... నన్ను ఇబ్బంది పెట్టి పెళ్లి చేయరు. కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న టైమ్లో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొనే అమాయకురాలిని కాదు నేను అంటోంది అనుష్క.