చాలా కంఫర్టబుల్ గా ఉంది : అనుష్క
ఇటీవల అనుష్క 'హెడ్ అండ్ షోల్డర్" షాంపూ యాడ్ లో నటించింది. అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. ఇంకా ఎన్ని యాడ్స్ వస్తే అన్నింటిలోనూ నటించాలనుకుంటోందట. దానికి కారణం కూడా చెబుతోంది. అనుష్క. 'యేడాదికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. కాబట్టి ప్రేక్షకులకు అడపాదడపా మాత్రమే కనిపిస్తాను. అదే యాడ్స్ లో నటిస్తే ఏ టీవీ ఆన్ చేసినా ప్రేక్షకులకు కనిపించే అవకాశం ఉంటుంది.
అలా రోజులో కనీసం నాలుగైదుసార్లుకు పైగానే కనిపించే వీలు ఉంటుంది. కాబట్టే యాడ్స్ లో నటిస్తున్నాను. అలాగే యాడ్స్ షూటింగ్స్ కి తక్కువ సమయం పడుతుందని, పారితోషికం మాత్రం భారీగా ఉండటం కూడా సౌకర్యవంతంగా ఉంది"అని తనుష్క చెబుతోంది.
anushka nagarjuna damarukam nanna vikram tollywood kollywood అనుష్క నాగార్జున ఢమరుకం నాన్న విక్రమ్ టాలీవుడ్ కోలీవుడ్


Click it and Unblock the Notifications