గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అనుష్క ఖరారు

By Srikanya

Anushka confirmed for Gautham Menon Project
చెన్నై : ప్రస్తుతం 'బాహుబలి', 'రుద్రమదేవి'లో నటిస్తున్న అనుష్క.. అవి పూర్తి కాగానే ఈ సినిమా చేయనుంది. స్క్రిప్టు వినకపోయినా.. అజిత్‌, గౌతమ్ మీనన్ చిత్రం కావడంతో అనుష్క ఒప్పుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇంకా కాల్షీట్లు ఇవ్వలేదని.. తెలుగు సినిమా విషయం కొలిక్కి వచ్చాక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

దీని గురించి గౌతం మీనన్ మాట్లాడుతూ.. ''అజిత్‌ సరసన నటించేందుకు అనుష్కతో చర్చించాం. ఆమె ఒప్పుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తాము'' అని చెప్పారు.

'మంగాత్తా', 'ఆరంభం', 'వీరం' విజయాలతో ఉత్సాహంగా ఉన్నాడు 'తల' అజిత్‌. తమన్నాతో ఆడిపాడిన ఈ హీరో త్వరలోనే అనుష్కతో రొమాన్స్‌ చేయనున్నాడు. గతంలో సూర్య, గౌతంమీనన్‌ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ కథ తాజాగా అజిత్‌ చెంతకు చేరిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలించాడు గౌతం. ఆఖరికి ఆ అవకాశం అనుష్కను వరించింది.

'రెండు' చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 'వేట్టైక్కారన్'తో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ చిత్ర విజయంతో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరింది. సూర్యతో చేసిన 'సింగం' (యముడు), సింగం 2 ఘన విజయం సాధించటంతో అక్కడా బిజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగు 'వేదం' రీమేక్ అయిన 'వానం'లో వేశ్యగా,అలాగే విక్రమ్ సరసన 'దైవమగన్' చిత్రంలో నటించింది. అజిత్ 'బిల్లా'లో నయనతార బికినీ ధరించి ఎంత పాపులారిటీ దక్కించుకుందో అలాగే అదే సినిమాతో తెలుగులో అనుష్క తానేం తక్కువ కాదని నిరూపించుకుంది. దాంతో అప్పట్లోనే అజిత్, అనుష్క కాంబినేషన్ లో చిత్రం చేయాలని నిర్ణయం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X