అనూష్కకి వీసా సమస్య
ఓ సాంగ్ షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్ళవలిసి ఉన్న అనూష్కకి వీసా రిజెక్టు కావటంతో సమస్య వచ్చింది. ప్రముఖ తమిళ హీరో విజయ్ హీరోగా చేస్తున్న వెట్టికారన్ లో పాట కోసం అంతా రెడీ అయినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.అప్పటికీ దర్శకుడు తన ఇన్ఫూలియన్స్ ని ఉపయోగించినా ఫలింతం లేకుండా పోయింది. దాంతో దీపావళికి రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రం లేటయ్యేటట్లు ఉంది. అయితే విజయ్ సూచన మేరకు ఆ పాటను పూనాలో తీయటానికి నిర్ణయించుకున్నారు. ఆ లొకేషన్ లో ఇంతకు ముందు రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో శివాజీ చిత్రం కోసం బల్లేలక్కా పాటను చిత్రీకరించారు.ఇక ఆ పాట ఓ హైటెక్ నెంబర్ అని తెలుస్తోంది. ఈ నెలాఖరున షూటింగ్ జరపబోయే దీనికోసం బాలీవుడ్ డాన్సర్స్ ని రప్పిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో షూటింగ్ అనుకుని చేసుకున్న ఏర్పాట్లు, అందుకోసం ఖర్చుపెట్టిన డబ్బు మాత్రం తిరిగిరావు అని నిర్మాత ఫీలవుతున్నాడు. ఇక అనూష్క ప్రస్తుతం సముద్ర దర్శకత్వంలో పంక్షాక్షరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సరసన, క్రిష్ దర్శకత్వంలో వేదంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











