ఆ హీరో దర్శకత్వంలో అనుష్క..
తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తూ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలో అనూష్క నటిస్తోంది. ఆ పాట షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తనలోని దర్శకత్వ ప్రతిభను బయటపెట్టే పనిలో ఈ పాటను చిత్రీకరిస్తన్నారు ధనుష్. సరదాగా ఆయన ఈ పాటకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ గీతం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచాలన్నది ధనుష్ ఉద్దేశం. ఫిల్మ్‌సిటీలోని రైల్వే స్టేషన్‌లో ఆయన ఈ గీతాన్ని చిత్రిస్తున్నారు. ఇక ధనుష్ ఈ పాటలో డాన్స్ చేస్తారు. ఆయన డైరక్ట్ చేస్తూ నటిస్తారు. అనూష్క కూడా దనుష్ తో పాటు చిందులు వేస్తుంది. అనూష్క కి తమిళ నాట ఉన్న క్రేజ్ ఈ పాటను మార్కెట్ చేయటానకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.ఇక అనూష్క ప్రస్తుతం 'యముడు'సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తొలి భాగం రూపొందించిన హరికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కథ పూర్తిగా సిద్ధమైంది. ఇందులోనూ హీరో గా నటించేందుకు సూర్య అంగీకారం తెలిపింది. అలాగే సంగీతం ను దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తారు. అలా మొదటి చిత్రానికి పనిచేసిన టీమ్ మొత్తం ఈ 'యముడు 2'కి పనిచేయటానికి రెడీ అవుతున్నారు. సూర్య కూడా సెవెంత్ సెన్స్ చిత్రం ఊహించిన విధంగా వర్కవుట్ కాకపోవటంతో మరో కమర్షియల్ సక్సెస్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. దానికి సీక్వెల్ సరైన మార్గం అని ఫిక్సయ్యాడని తమిళ పత్రికలు అంటున్నాయి. అందులోనూ అనూష్కకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఆమెకు తెలుగులో ఆఫర్స్ లేవు. కేవలం నాగార్జున సరసన ఢమురకం లో మాత్రమే చేస్తోంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. దాంతో ఆమె దృష్టి ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ స్టేజికి వెళ్లాలనే ఉంది.


Click it and Unblock the Notifications











