అరుంధతి సూపర్ హిట్ తో అనూష్క తెలుగు, తమిళంలో పూర్తి స్ధాయి బిజీ అయిపోయింది. తాజాగా విజయ్ హీరోగా రూపొందుతోన్న Vettaikaran అనే తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాటలు చెప్పింది. విజయ్ తో పనిచేయటం అంటే మాటలు కాదు. అతను ఓ అధ్బుతమైన నటుడు. ఇక అతను టైమింగ్ లో ఇచ్చే పంచ్ లు సంగతి అయితే చెప్పక్కర్లేదు. అతను నాకు నటనలో సలహాలు కూడా ఇస్తున్నాడు. అతనితో చేస్తున్న రోజులు అస్సలు ఎలా గడుస్తున్నాయో తెలియటం లేదు. అతని కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తున్నా అంది. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నటించటం గురించి మాట్లాడుతూ నేను మొదటి సారి మహేష్ తో పనిచేయటం..నాకు చాలా హ్యాపీగా ఉంది..త్రివిక్రమ్ సార్ కూడా చాలా సహకారం అందిస్తున్నారు అని పొగిడింది. అలాగే తను బికినీ వేసిన భిల్లా త్వరలోనే రిలీజ్ కానున్నదని, గోపీచంద్ తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నానని వివరించింది.
Story first published: Tuesday, March 31, 2009, 13:41 [IST]