హాట్ స్టార్ అనుష్కకి ఆ హీరో వార్నింగ్ ఇచ్చాడా?
అరుంధతి పుణ్యమా అని అనుష్క తెలుగు, తమిళంలలో టాప్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు తమిళంలో వేదం రీమేక్ వానమ్ లో చేస్తున్న ఆమెకు హీరో శింబు పెద్ద తలనొప్పిలా తయారయ్యాడంటున్నారు. ఆమెను లింగు స్వామి చిత్రంలో చేయవద్దంటూ వార్నింగ్ లాంటిది ఇచ్చాడని తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. మొదట శింబు హీరోగా లింగు స్వామి ప్రాజెక్టుని ప్రారంభించారు. తమన్నా హీరోయిన్ బుక్ చేసారు. మాదవన్ మరో కీలక పాత్ర అని చెప్పారు. అయితే శింబు తనకు కావలినన్ని డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేడని అర్దం కావటంతో లింగు స్వామి అతన్ని తన ప్రాజెక్టులోంచి తీసేసాడు. దాంతో శింబు పగ తీర్చుకునే రేంజిలో తమన్నాని దువ్వి...ఆ ప్రాజెక్టుని తప్పించాడు. ఆ తర్వాత ఇప్పుడు లింగు స్వామి..అనుష్కని ప్రాజెక్టు చేయమని ఆహ్వానిస్తే..ఆమెను కూడా శింబు చేయవద్దని బెదిరిస్తున్నాడని చెప్తున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే తమిళంలో నిలదొక్కుకుంటున్న అనుష్క..ఈ ఇష్యుని పెద్దది చేయటం ఇష్టం లేక మిన్నకుండిపోయిందని చెప్తున్నారు. ఇక ఇదే కథతో లింగు స్వామి..ఆర్య, మాధవన్ లతో తమిళంలో మాధవన్, మహేష్ లతో తెలుగులోనూ సినిమా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











