»   » అక్కడ కూడా సెక్సీ పోజులిచ్చి రెచ్చగొట్టేస్తోంది...!?

అక్కడ కూడా సెక్సీ పోజులిచ్చి రెచ్చగొట్టేస్తోంది...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క తెలివంతా సినిమాల ఎంపికలోనే వుందని అందరూ ఒప్పుకుంటారు. ఎప్పుడు ఎటువంటి పాత్రలు పోషించాలో ఈ అమ్మడికి బాగా తెలుసు. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా తన కెరీర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది. ఆమధ్య తమిళంలో తను చేసిన 'సింగం' సినిమా ఘన విజయం సాధించడంతో అక్కడ కూడా అను మంచి డిమాండ్ లో వుంది. ప్రస్తుతం చేస్తున్న 'వానం' సినిమా ఆమె పొజిషన్ ను మరింత పటిష్టపరుస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆమధ్య తెలుగులో తను చేసిన 'వేదం' సినిమాకు ఈ 'వానం' రీమేక్. తెలుగులో తను పోషించిన పాత్రనే అక్కడా చేస్తోంది. పైగా, దీనిని అక్కడ కూడా తన స్నేహితుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతో ఆమె కెరీర్ కి ఇది మరింత హెల్ప్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో తనది వేశ్య పాత్ర కాబట్టి ఆమె డ్రెస్సింగ్ సెక్సీగా, కవ్వించేలా వుంటుంది. ఇప్పుడా సినిమాలోని ఆమె స్టిల్స్ చూసి, తమిళ తంబీలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారట. అంతలా అను తమిళ కుర్రాళ్ళని తన సెక్సీ పోజులతో రెచ్చగొట్టేస్తోంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంతగా రెచ్చగొడుతుందో! ఏమైనా, కథానాయికల మధ్య పోటీ ఎక్కువవుతున్న తరుణంలో ఈ స్వీటీ కరెక్ట్ సినిమాని ఎంచుకుందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

English summary
Vaanam (Sky) is a forthcoming Indian Tamil action-drama film written and directed by Krish. A remake of his own 2010 Telugu film Vedam, the film stars Silambarasan, Sneha Ullal, Sonia Agarwal, Prakash Raj, Bharath and Anushka Shetty in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu