అనుష్క ఛాన్స్ తో సమంతాకి షాక్...
ఏం మాయ చేసావె..అంటు వెండితెరకొచ్చి వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న సమంతాకు అనుష్క రూపంలో ఓ పెద్ద ఝలక్ తగిలింది. తమిళ హీరో అజిత్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 50వ చిత్రంలో తన సరసన నటించే ఛాన్సు సమంతాకివ్వగా ఇప్పడు అమ్మడిని తప్పించి అనుష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. సూర్య, అనుష్క నటించిన 'సింగమ్" సినిమా హిట్ అవ్వడంతో అజిత్, వెంకట్ ప్రభు లు ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. క్లైడ్ నైన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత దయానిధి అఝగిరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా ..యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. అజిత్ 50వ చిత్రంలో తనకి ఛాన్స్ వచ్చిన అవకాశాన్ని ఈ మధ్య యముడు సక్సెస్ మీట్ లో అనుష్క కూడా దాదాపు నిర్థారిస్తునే మాట్లాడటం గమనార్హం. అయితే తనను తీసేసి అనుష్కను తీసుకోవడం పట్ల సమంత విపరీతమైన షాక్ కు గురయ్యిందని వినికిడి.


Click it and Unblock the Notifications











