ఐటీకి పట్టుబడ్డ అనుష్కకు సూపర్ స్టార్ రిలీఫ్ ఇచ్చారా...!

By Sindhu

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అనుష్కకి తమిళంలో కూడా దీనికి సరిసమానంగానే క్రేజ్ ఉంది. ఈ క్రేజే ఇప్పుడు ఈ అమ్మడి పాలిట వరమైయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రానా సినిమాలో అనుష్కని ఒక కథానాయకగా ఎంపికయ్యిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకునే ఒక కథానాయకగా ఎంపికవ్వగా మరో కథానాయికగా అనుష్కని ఎంపిక చేశారట. ఈ పాత్ర కోసం తొలుత రేఖ, విద్యాబాలన్, అసిన్, ఇలియానా, త్రిష, నయనతారలని పరిశీలించినప్పటికీ రజనీ అనుష్క పేరును సూచించడంతో ఈ భారీ ఆఫర్ అనుష్కకి దక్కింది. ఇటీవల ఐటీ అంధకారులు చేసి దాడులతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిన ఈ మంగళూరు బ్యూటీకి ఈ ఆఫర్ మంచి రిలీఫ్ నిచ్చిందని తెలుస్తోంది..కాగా, ఈ గురువారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. అయితే ముందుగా నిర్ణయించుకున్నట్టు ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను లండన్ లో ఆరంభించడంలేదట. చెన్నైలోని ఏవియం స్టూడియోలో ఓ భారీ సెట్ వేసారని, ఇందులోనే 20రోజులు పాటలు షూటింగ్ చేసి అనంతరం లండన్ వెళ్ళాలని రజనీకాంత్ అనుకుంటున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X