అనుష్కని పొగడ్తలతో ముంచెత్తుతోన్న వివాదాల హీరో...!?
తెలుగులో బాక్సాఫీస్ దగ్గర దెబ్బతిన్నప్పటికీ ఒక మంచి తెలుగు సినిమా అన్న పేరు తెచ్చుకున్న 'వేదం" తమిళంలో 'వానమ్"గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. శింబు, భరత్, అనుష్క, ప్రకాష్ రాజ్, సోనియా అగర్వాల్, స్నేహా ఉల్లాల్, వేగ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటలు చేశాడట. తమిళ నేటివిటికీ సంబంధించిన చిన్నచిన్న మార్పులు తప్ప తెలుగులో మంచి పేరు తెచ్చిన ఓరిజినల్ స్క్రిప్ట్ తమిళ్ లో కూడా ప్రజెంట్ చెయ్యబోతున్నట్టు డైరెక్టర్ క్రిష్ చెపుతున్నాడు. తెలుగులో అమలాపురం సరోజగా నటించిన అనుష్క తమిళంలోనూ అదే క్యారెక్టర్ చేస్తోంది. శింబు ఎంతో మనసుపడి చేస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు.
వివాదస్పద హీరోగా తమిళ హిరో శింబుకి గుర్తింపు ఉంది. ఈ వివాదాస్పద హీరోకి అనుష్క పిచ్చపిచ్చగా నచ్చేసిందట. సినిమాల్లో గ్లామర్ గా కనిపించినా విడిగా మాత్రం తను చాలా పద్దతి గల అమ్మాయి అని శింబు అంటున్నాడు. అలాగే మంచి అందగత్తె మాత్రమే కాదు..అనుష్క మంచి ఆర్టిస్ట్ కూడా అని కితాబులిచ్చేస్తున్నాడు. విడిగా తను చీరలు, చుడిదారులే వాడుతుందని, ఆ సింప్లిసిటి తనకు బాగా నచ్చిందని కూడా శింబు అంటున్నాడు. మొత్తానికి ఈ కుర్ర హీరో అనుష్కని బాగా ఇష్టపడుతున్నట్టు అతని మాటలు చెబుతున్నాయి కదూ.


Click it and Unblock the Notifications











