అనుష్క పరువు తీస్తున్న ‘శర్మ’..!
టాలీవుడ్ లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకొన్న అలనుష్క ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తోంది. అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఆమెపై పుకార్లు పుట్టిస్తున్నారు. మెన్నామద్యన చైతుకీ, అనుష్క కి పెళ్లైపోయిందని కోలీవుడ్ కోడైకూసింది. ఇప్పుడేమో అనుష్క స్కిన్ షో, బికిని ఫోటోలు అంటూ ఇంటర్ నెంట్ లో హల్ చల్ చేస్తున్నాయి..కోలీవుడ్ బాలీవుడ్ లే కాకుండా మరో ప్రక్క ఇంటర్నెట్ కూడా అనుష్క కి పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్ లో అనుష్క శర్మకు సంబందించిన సమాచారాన్ని తనకు అంటగడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దానికి తోడు ఇంటర్నెట్ నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచురించడం బావ్యం కాదంటోంది.
ఒకే పేరు వుండడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో కథానాయిక అనుష్క ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. పేరులో వున్న పోలిక వల్ల, ఇన్నాళ్లూ తను సంపాదించుకున్న పేరూ, పరువూ గంగలో కలిసిపోతున్నాయని బాధపడిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే… హిందీ నటి అనుష్కా శర్మ బికినీలో వున్న ఫోటోలు, అశ్లీల భంగిమలలో వున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. అంతవరకూ బాగానే వుంది.
అయితే, ఆ ఫోటోల పక్కన అనుష్కా శర్మ పేరు బదులు అనుష్కా శెట్టి అని పెడుతుండడం వల్లే చిక్కొచ్చిపడింది. ఆ ఫోటోలు మన అనుష్కవే అనుకుంటున్నారంతా. ఈమధ్య 'నాన్న" సినిమా తమిళ వెర్షన్ ప్రమోషన్ కోసం తమిళనాడు వెళ్ళినప్పుడు, అక్కడి పాత్రికేయులు కూడా ఇదే అడిగేసరికి అనుష్కకు ఒళ్లు మండిపోయిందట. 'శర్మకీ, శెట్టీకి తేడా తెలియదా? అడగాలని చెప్పి మీరు పనిగట్టుకుని అడుగుతున్నారు' అంటూ చిర్రుబుర్రులాడింది. ఏమైనా, ఆ శర్మ ఫోటోలు మాత్రం ఈ శెట్టీని ఇలా ఏడిపించేస్తున్నాయి. దాంతో ఎప్పుడూ చిర్నవ్వుతో కనిపించే అనుష్క ఇప్పుడు సీరియస్ గా కనిపిస్తోంది. మీడియాతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా మాట్లాడే అనుష్క ఒక్కసారి ఉగ్రరూపం గావించే సరికి మీడియా వారు అవాక్కయ్యారంట...


Click it and Unblock the Notifications











