హాట్ స్టార్ అనుష్కపై కన్నేసిన సకల కళా వల్లభుడు
సకల కళా వల్లభుడు కమల్ హాసన్ తన దృష్టి ఇప్పుడు అనుష్కపై పడిందంటున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ఇరుకిండ్రాన్ లో ఆమెను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తమిళ పరిశ్రమలో వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ సంస్ధతో కలిసి రాజ్‌కమల్ ఫిలింస్ బ్యానర్ లో కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించటానికి రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఆ చిత్రం పీరియడ్ కధాంశంతో ఉంటుందని చెప్తున్నారు. ఇక అనుష్క ప్రస్తుతం విక్రమ్ సరసన మదరాసుపట్టణం ఫేమ్ విజయ్ దర్శకత్వంలో నటిస్తోంది.అలాగే శింబు సరసన..తెలుగు చిత్రం వేదం రీమేక్ లో చేస్తోంది. వీటితో పాటు సూర్య తదుపరి చిత్రంలోనూ ఆమె పరిశీలనలో ఉంది. విజయ్, మాదవన్ లతో ఇప్పటికే ఆమె నటించింది. త్వరంలో ఆర్య సరసన లింగు స్వామి దర్శకత్వంలో వేట అనే చిత్రంలో చేయనుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు సరసన కూడా ఆమెనే తీసుకుంటున్నారు. ఇక కమల్ హాసన్ తాజ్ చిత్రం మన్మధ బాణం త్వరలో రిలీజ్ కాబోతోంది. అందులో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ కామిడీగా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











