'డ్రాకులా 2012' 3D లో అనుష్క
తమిళ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి డ్రాకులా 2012 టైటైల్ తో ఓ చిత్రం రూపొందనుంది. వినయన్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. బ్రామ్ స్టాకర్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయమై దర్శకుడు వినయన్ మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టు చేయటానికి అనుష్క చాలా ఆసక్తి చూపిస్తోంది. ఆమె దాదాపు ఖరారు అయినట్లే. ఈ చిత్రం షూటింగ్ మొత్తం రొమానియాలో జరుగుతుంది. ఈ చిత్రంలో అనుష్క ఎమ్.బి.బియస్ స్టూడింట్ గా కనపించనుంది. ఆమె కలలోకి వచ్చే ఓ వ్యక్తితో ప్రేమలో పడుతుంది.
అక్కడ నుంచి కథ ఓ విచిత్రమైన మలుపు తిరిగుతుంది. ఈ చిత్రం తమిళ, తెలుగు, ఇంగ్లీష్ లలో రూపొందుతుంది. ఈ చిత్రాన్ని త్రీడి లో రూపొందిస్తాము అన్నారు. ఇక అనుష్క ప్రస్తుతం నాగార్జున హీరోగా రూపొందుతున్న ఢమురకం చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి డైరక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంఠసీగా ఆ చిత్రం రూపొందనుంది. పిబ్రవరిలో ఢమురకం చిత్రం విడుదల కానుంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











