'బృందావనంలో నందకుమారుడు'లో అనూష్క

By Srikanya

అనూష్క తాజా చిత్రానికి బృందావనంలో నందకుమారుడు అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనూష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇందులో రాధిక ఓ కీలకపాత్రను పోషిస్తోంది. తమిళంలో ఈ చిత్రాన్ని యూ.టీవి మోషన్ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రసాద్ .వి.పొట్లూరి అందిస్తున్నారు. ఇందులో అనూష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ రేంజిలో ఈ చిత్రం అద్బుతంగా రూపొందుతోందని చెన్నై వర్గాల టాక్.


అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది.అదే కథ కనుక అయితే ఆ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు.అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. అయితే ఆర్యకు తెలుగులో ఎంత వరకూ మార్కెట్ ఉన్నది అనే దానిపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X