అనూష్క తో నేను చేయటం లేదు...లారెన్స్
'మాస్", 'స్టైల్", డాన్ చిత్రాలు డైరక్ట్ చేసిన లారెన్స్ దర్శకత్వంలో అనూష్క 'కాంచన" అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనూష్క ప్రేస్ లోకి లక్ష్మీ రాయ్ వచ్చి చేరింది. అనూష్కకీ, లారెన్స్ కీ ఏం చెడిందో కానీ లారెన్స్ ఆమె ఊసెత్తితే చాలు మండిపడుతున్నాడని చెప్తున్నారు. అంతేగాక రీసెంట్ గా ఓ మీడియామీట్ పెట్టి ...అనుష్క ఒక కీలక పాత్రను పోషిస్తోందని బయిట వినవపడుతోంది. అయితే అవన్నీ రూమర్సే. లక్ష్మీ రాయ్ మంచి ఫెరఫార్మర్..ఆమెను ఈ సినిమాకు తీసుకున్నాను అని చెప్పారు.
అలాగే నా దర్శకత్వంలో అనుష్క నటించడం లేదు, నటించదు అని స్పష్టంచేశారు. అదే విధంగా ముని చిత్రంలో నటించిన రాజ్‌కిరణ్, కోవై సరళ కూడా కాంచనలో నటించడం లేదని లారెన్స్ వెల్లడించారు. ఇందులో హీరోయిన్‌గా నటి లక్ష్మీరాయ్ నటిస్తున్నారనిఆమెది చాలా ప్రాముఖ్యత ఉన్నపాత్ర అని ఆయన వివరించారు. ఇక కాంచన చిత్రం లారెన్స్ ఇంతకుముందు రూపొందించిన మునిచిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం లారెన్స్ ఈ చి్త్రం పనిమీదే బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కథ,స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తూ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











