స్టార్ హీరో నిర్మాతకు షాక్ ఇచ్చిన అనుష్క

By Srikanya

చెన్నై: సాధారణంగా పెద్ద హీరో ప్రక్కన సినిమా అంటే హీరోయిన్స్ మరేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేస్తారు. కథ, రెమ్యునేషన్ వంటివి కూడా చూసుకోరు. పెద్ద హీరో తో సినిమా అంటే తనకు ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాలు వస్తాయని భావిస్తారు. ఇదే రకంగా ఆలోచించి అనుష్క విషయంలో ఓ భారీ తమిళ నిర్మాత దెబ్బ తిన్నాడు. హీరో ఎవరైతేనేం తను రెమ్యునేషన్ నచ్చితేనే చేస్తానని తెగేసి చెప్పి ఆ నిర్మాతకు షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే... 'సిరుత్త్తె' (తమిళ విక్రమార్కుడు) ఫేం శివ తాజాగా అజిత్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా అనుష్క పేరును ప్రస్తావించారు. ఆ మేరకు నిర్మాతలు కూడా అనుష్క వద్దకు వెళ్లి నటించమని కోరారు. అజిత్‌కు జోడీగా కనిపించటం మంచి అవకాశమని, పారితోషికం తగ్గించుకోవాలని చెప్పినట్టు సమాచారం. స్పందించిన అనుష్క.. ఎవరి సినిమా అయితే నాకేంటి? కథ నచ్చితే చేస్తా. పారితోషికం తగ్గించనని ఖరాఖండీగా చెప్పింది. అయినా ఆమెను ఇందులో నటింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌వర్గాలు చెబుతున్నాయి.

అయితే అజిత్ వంటి స్టార్ హీరో ప్రక్కన సినిమా అనగానే చాలా మంది హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు.. తమకు ప్రత్యేకమైన మైలేజీ వస్తుందని భావిస్తారు. అయితే ఇప్పటికే తనకు రావాల్సినంత గుర్తింపు తమిళ పరిశ్రమలో వచ్చిందని భావించే అనుష్క ఇలా అందింటున్నారు. మాధవన్ తో చేసిన 'రెండు' చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టినా అదృష్టం వరించకపోవడంతో వెనుదిరిగింది అనుష్క. ఆ తర్వాత రీఎంట్రీతో 'సింగం', 'వేట్త్టెక్కారన్‌'వంటి పలు ప్రాజెక్టులతో కోలీవుడ్‌లో అమ్మడి రేంజ్‌ అమాంతం పెరిగింది. ఇప్పుడు కార్తి సరసన 'అలెక్స్‌ పాండియన్‌', సూర్యకు జంటగా 'సింగం2', ఆర్యతో 'ఇరండాం ఉలగం'తో తీరికలేకుండా ఉంది.

ఇక తెలుగులో అనుష్క నటించిన ఢమురకం చిత్రం ఈ నెల 20న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా సాంకేతిక కారణాలు వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాం అని నిర్మాతలు చెప్తున్నారు. నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. అనుష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X