అనుష్క వ్యక్తిగతంగా తిరస్కరించిందట!
దక్షిణాది తారలను చూసి బాలీవుడ్ నటీనటులంతా ఓ విషయంలో కుళ్లుకుంటున్నారు. దక్షిణాది ప్రేక్షకులు సినీ తారలకి ఏకంగా నీరాజనాలు పట్టేస్తుంటారు. పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు పెట్టేస్తుంటారు. భారీగా రక్తతిలకాలు దిద్దడం, పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు, ఇంకా అతిక్రమిస్తే క్షీరాభిషేకాలు ఇలాంటివి కోకొల్లలు. ఒక్కో హీరోకి లెక్కకు మించిన అభిమాన సంఘాలు టాలీవుడ్ లోనూ ఉన్నాయి. అయితే గుళ్లు గోపురాలు కట్టించేంత అభిమానం మాత్రం లేదు. తమిళనాడులో మాత్రం ఇందుకు భిన్నంగా హీరోయిన్ల పేరిట కూడా అభిమాన సంఘాలు పెట్టి, గుళ్లు కట్టించి పూజలు కూడా చేసేస్తుంటారు. ఆ మద్య కుష్బూకి గుడి కట్టించారు. తర్వాత ఆ గుడిని కొంత మంది వ్యక్తులు పగలగొట్టడం జరిగింది. బొద్దు గుమ్మ నమితకూ ఈ మధ్య కొందరు గుడి కడతామన్నారు. ఇప్పుడు అనుష్క వచ్చింది.
అనుష్క నటించిన 'అరుంధతి' ఈమధ్యనే తమిళంలోనూ విడుదలై మంచి విజయం సాధించింది. దాంతో అక్కడ ఆమెకు అభిమానులు మొదలయ్యారు. ప్రస్తుతం ఆమె స్టార్ హీరో విజయ్ తో కలిసి 'వేట్టైకారన్' చిత్రంలో నటిస్తుండటంతో ఆ ఇమేజ్ తో పాటి, క్రేజ్ కూడా మరింత పెరిగింది. అనుష్క పేరుతో ఓ అభిమాన సంఘం కూడా ప్రారంభమైంది. ఈమధ్యనే వారు అనుష్కను కలిసి ఆమెకు గుడి కట్టిస్తామన్నారట. అయితే అందుకు అనుష్క వ్యక్తిగతంగా నిరాకరించిందట. 'అభిమానుల గుండె గుడిలో తారలు ఉండొచ్చు. అంతే కానీ తారలను తీసుకు వెళ్లి గుడిలో పెట్టడం ఏమాత్రం బాగోలేదని చెప్పిందట. అందుకే అభిమానుల కోరికను సున్నితంగా తోసిపుచ్చాను అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











