ఆమె అందాలకు దాసోహులైనవారిలో హీరోలు కూడా ఉన్నారు..!?
అనుస్క అందచందాలకు దాసోహమైన ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఉన్నారు. 'బిల్లా" లో బికినీ వేసుకొని అదరగొట్టిన ఈ భామ ఈ చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అరుంధతిగా, వేశ్యగా నటించడం అనుష్క కే చెల్లిందని చెప్పవచ్చు. చాలా మంది హీరోలు అనుష్కతో నటించాలని తాపత్రయపడేవారు ఉన్నారు. అందులో ఒకరు తమిళ హీరో శింబు.
అనుష్క తో నటించాలని ఎన్నో రకాలుగా శింబు ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి అనుష్కతో ఒక్కసారైనా నటించాలని కొన్నాళ్లుగా ఆశలు పెట్టుకున్నాడట. తన సరసన అనుష్క నటిస్తే తను ఎంత పారితోషకం అడిగినా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానీ..అవసరమైతే తన కోసం స్క్రిప్ట్ ని కూడా రెడీ చేస్తానని అన్నాడట. కాని శింబుతో సినిమా చేసిన ఏ కథానాయిక అయినా ఇరుకుల్లో పడుతుందని, లేనిపోని వదంతులు వస్తాయని భావించి అనుష్క మాత్రం డైరీ ఖాళీ లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించిదని సమాచారం. ఇదిలా ఉంటే లక్ష్మీప్రసన్న, మనోజ్ మాత్రం తాప్సీని రికమండ్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











