అపరిచితుడుతో ప్రేమలో పడిన అనుష్క…!?
అందాల సుందరి అనుష్క ఓ పిచ్చోడి ప్రేమలో పడింది. అయ్యో పాపం అనుకుంటున్నారా..? అయితే ఒక క్షణం ఆగండి. అనుష్క ప్రేమలో పడింది నిజ జీవితంలో కాదు. సినిమాలో, ఇంతకీ ఆ పిచ్చోడు ఎవరో తెలుసా 'అపరిచితుడు" విక్రమ్. విక్రమ్ సరసన హీరోయిన్ గా అనుష్క ఓ తమిళ సినిమా చేయబోతోంది. మద్రాసిపట్టణం ఫేం విజయ్ అనుష్క కాల్షీట్లు సంపాదించాడని సమాచారం. విజయ్ దర్శకత్వంలో విక్రమ్ 'వేడి" అనే సినిమాలో నటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇందులో ఇలియానా కథానయికగా నటించనుందని కూడా తెలిసింది. అయితే ఇప్పుడా స్థానంలో అనుష్క ను తీసుకున్నారని సమాచారం. త్వరలో విజయ్ దర్శకత్వంలో విక్రమ్, అనుష్క లతోటి సినిమా తీయబోతున్నాడు. ఫ్యామిలీఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కు తుందని అంటున్నాడు విజయ్. మరో హీరోయిన్ కూడా ఇందులో కనిపించనుంది. అయితే ఇందులోనే విక్రమ్ పిచ్చోడిలా యాక్ట్ చేయనున్నాడట.
అనుష్క విక్రమ్ విజయ్ వేడి ఇలియానా అపరిచితుడు ఖలేజా anushka vikram vijay vedi ileana aparichitudu khaleja


Click it and Unblock the Notifications