'ఫన్నీ పోలీస్ ఉమెన్'గా అనూష్క అదుర్స్
అరుంధతి వంటి చిత్రాల ద్వారా తనకంటూ తెలుగులో ఓ స్టేచర్ ని ఏర్పాటుచేసుకుంటూ అందరి పెద్ద హీరోల సరసన సినిమాలు చేసిన కన్నడ భామ అనూష్క. ఆమె తాజాగా ఓ చిత్రంలో 'ఫన్నీ పోలీస్ ఉమెన్'గా కనిపించి అదరకొట్టనుంది. ఆ సినిమా మరేదో కాదు త్వరలో విడుదల కానున్న శకుని. కార్తీ హీరోగా రూపొందిన శకుని చిత్రంలో ఆమె చేసిన పోలీస్ పాత్ర ఉన్నది కాసేపే అయినా అద్బుతంగా పేలుతుందనే నమ్మకంగా ఉన్నారు దర్సక,నిర్మాతలు.
తమిళ హీరో కార్తీ హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రం 'శకుని'. ప్రణీత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ చిత్రాన్ని జూలై అరున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్‌దయాళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. రీసెంట్ గానే చిత్రం పాటల్ని విడుదల చేసారు. విభిన్న గెటప్ లతో కార్తీ ఈ చిత్రంలో వెరైటీగా కనిపించనున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్రేజ్..తమిళ,తెలుగు భాషల్లో నెలకొని ఉంది.
ఇక 'శకుని'చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే...'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే ఈ కథ అని చెప్పుతున్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, బాబా భాస్కర్, సహ నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్.శంకర్ దయాళ్.


Click it and Unblock the Notifications











