twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7 విదేశీ భాషల్లోకి అనుష్క తాజా చిత్రం

    By Srikanya
    |

    చెన్నై : సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం 'వర్ణ'(ఇరండాం ఉలగం) . తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. తాజాగా రష్యన్‌, జార్జియన్‌, ఉష్బెక్‌, తుర్కిష్‌ భాషల్లోనూ విడుదల కానున్నట్లు వెల్లడించారు. పీవీపీ సినిమా బ్యానరుపై రూ.60కోట్లతో తెరకెక్కించారు. ఇటీవలే ఆడియో, ట్రైలర్‌లను కూడా విడుదల చేశారు.

    హీరోయిన్, హీరో పూర్వజన్మకు వెళ్లే వ్యూహాత్మక కథతో సినిమాను రూపొందించారు. చిత్రయూనిట్‌ స్పందిస్తూ.. హాలీవుడ్‌కు దీటైన ఫాంటసీ కథ సినిమా ఇది. స్పందనను బట్టి మరిన్ని భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రామ్‌జీ కెమెరా పనితనం అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్‌ ఇంజినీరు స్టీఫన్‌, కైత్‌ విజువల్‌ ఎఫెక్ట్‌లు మరింత వన్నె తెస్తాయని పేర్కొంది. పలు విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కేత్ డెలివిన్ సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం.

    Anushka's 'Varna' for Diwali in seven languages

    7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, యుగానికొక్కడు చిత్రాలు... దర్శకునిగా సెల్వరాఘవన్ ప్రతిభకు నిలువుటద్దాలు. దక్షిణాది ప్రేక్షకులందరికీ ఈ చిత్రాలతో ఇష్టుడయ్యారు సెల్వరాఘవన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వర్ణ'. ఆర్య, అనుష్క ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని 70 కోట్ల భారీ వ్యయంతో పీవీపీ సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ముందెన్నడూ లేని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం తెరక్కెతోందని సమాచారం.

    చిత్ర సమర్పకుడు ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ-''విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న సినిమా ఇది. అయినా.. కథ, కథనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు దర్శకుడు. అంచనాలకు అందని రీతిలో కథ, కథనాలు సాగుతాయి. భారతీయ ప్రేక్షకుడు చూడని అద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆర్య, అనుష్క పాత్రలు పలు కోణాలతో భిన్నంగా ఉంటాయి. ఛాలెంజ్‌గా తీసుకొని వారిద్దరూ ఈ పాత్రలు పోషించారు. హారిస్ జైరాజ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆగస్టులో ఘనంగా విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ... ''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి''అని తెలిపాయి. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది.

    English summary
    
 The Arya-Anushka starrer, 'Varna', the most anticipated film of the year directed by Selvaraghavan, is finally slated for a Diwali release. The movie will be competing with biggies, like Ajith’s 'Aarambam' and Karthi’s 'All in All Azhaguraja'. Set on a massive canvas and produced by PVP Cinemas on a lavish scale, 'Irandam Ulagam' has already captured audiences’ attention through the trailer and chart-topping music by Harris Jayaraj. Selva’s favourite, Ramji, is behind the camera. The makers of the film have confirmed that IU will be releasing in Tamil, Telugu, Hindi, Georgian, Russian, Uzbek and Turkish. 'Irandam Ulagam' is a Rs 60-crore extravaganza, with cutting- edge special effects and multiple shooting locations, including Hyderabad, Chennai, Goa, Georgia and Tashkent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X