ప్రముఖ డైరెక్టర్‌కు అనుష్క లైన్ క్లియర్.. సాహోకు దూరమైన తర్వాత..
బాహుబలి చిత్రం తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇంకా విడుదల కాలేదు. అందుకు కారణం ఆమె ఎక్కువగా లావు కావడమే అనే వాదన మీడియాలో వినిపించింది. సాహో చిత్రం నుంచి ఆమెను తప్పించారనే ప్రచారం జరిగింది
బాహుబలి చిత్రం తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇంకా విడుదల కాలేదు. అందుకు కారణం ఆమె ఎక్కువగా లావు కావడమే అనే వాదన మీడియాలో వినిపించింది. సాహో చిత్రం నుంచి ఆమెను తప్పించారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అనుష్క నటిస్తున్న భాగమతి చిత్రం కూడా రిలీజ్ కావడానికి నానా తంటాలు పడుతున్నది. ఈ క్రమంలో తమిళ దర్శకుడి చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరగడం గమనార్హం.

సాహో నుంచి తప్పించిన తర్వాత..
బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' చిత్రం కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను కలిశారని, హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చినట్టు కూడా గతంలో వదంతులు వచ్చాయి. అయితే ఎక్కువ లావుగా కావడంతో తప్పించారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆ పాత్రకు ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తె లిసిందే.

గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో
ప్రస్తుతం అనుష్క కొత్త సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రచారం జరుగుతున్నది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందించే సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తమిళ సినిమా రంగంలో న్యూస్ వైరల్‌గా మారింది. గౌతమ్ నిర్మించే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

తమిళం, తెలుగు భాషల్లో..
ప్రస్తుతం విక్రమ్ హీరోగా ‘ధ్రువ నక్షత్రం' అనే సినిమాను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మొదలుపెట్టబోయే సినిమాకు గౌతమ్ ప్రిపరేషన్ మొదలు పెట్టారట. ఆ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నిర్మాతలు అనుష్కను ఇటీవల సంప్రదించినట్టు తెలుస్తున్నది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం భాగమతి చిత్రంలో..
‘బాహుబలి: ది కన్‌క్లూజన్' షూటింగ్ సమయంలోనే అనుష్క ‘భాగమతి' చిత్రంలో నటించారు. జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. ఈ చిత్రం తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.

డబుల్ రోల్‌లో
ఉన్ని ముకుందన్, జయరాం, ఆది పినిశెట్టి, ఆశా శరత్ తదితరులు ‘భాగమతి'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరులో ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 2018లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుష్క రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











