విమర్శలకు అనుష్క ధీటైన జవాబు.. జేజమ్మ స్టామినా ఇదే..

By Rajababu

బాహుబలి చిత్రం తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం భాగమతి. హారర్ థ్రిల్లర్ సినిమాగా రూపొందిన భాగమతిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు కారణాల వల్ల ఈ చిత్ర విడుదల వరుస వాయిదాలు పడుతున్నది. లేటైనా లేటెస్ట్‌గా అనుష్క కొత్త రూపంలో ప్రేక్షకులకు కనిపించనున్నారనేది సినీ వర్గాల టాక్. టాలీవుడ్‌లో అనుష్క పనైపోయిందనే విమర్శలకు అనుష్క తగిన సమాధానం చెబుతున్నది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

 స్టూడియో గ్రీన్ చేతికి భాగమతి చిత్రం

స్టూడియో గ్రీన్ చేతికి భాగమతి చిత్రం

భాగమతి చిత్ర తమిళ థియేట్రికల్ హక్కులను స్టూడియో గ్రీన్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా 15 కోట్ల రూపాయలు చెల్లించి హక్కులను దక్కించుకొన్నార.

 40 కోట్ల బడ్జెట్‌తో

40 కోట్ల బడ్జెట్‌తో

భాగమతి చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. మంచి సాంకేతిక విలువలతోపాటు గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం జనవరి 26న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

 అశోక్ దర్శకత్వంలో

అశోక్ దర్శకత్వంలో

భాగమతికి చిత్రానికి పిల్లా జమీందార్ దర్శకుడు అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆశా శరత్, ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

 మూడు భాషల్లో

మూడు భాషల్లో

ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న భాగమతి చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలకానున్నది. అనుష్క జన్మదినం రోజున మూడు భాషల్లో ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్రయూనిట్ సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

రూమర్లను ఖండించిన అశోక్

రూమర్లను ఖండించిన అశోక్

భాగమతి సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నదనే వార్తలను దర్శకుడు అశోక్ ఇటీవల ఖండించారు. ఈ చిత్రం హర్రర్ సినిమా కాదని, భాగమతిని చూసిన తర్వాత అనుష్క నటన మరోసారి హైలెట్‌గా నిలుస్తుంది అని అశోక్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X