అనుష్క మేకప్ వివాదం సెటిలైందా?
చెన్నై: హాట్ హాట్ అందాలతో ఇటు తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలో ఓ ఊపు ఊపుతున్న భామ అనుష్క. అనుష్క కార్తితో కలిసి అలెక్స్ పాండ్యన్ అనే తమిళ చిత్రంలో నటిస్తుండగా ఆ మధ్య షూటింగు సెట్లో అరవ మేకప్ మెన్లు ఆమెతో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. స్విటీని దుర్భాషలాడటంతో రచ్చ రచ్చ చేసారు.
అనుష్క పర్సనల్ మేకప్‌మెన్‌కి తమిళ మేకప్‌మెన్స్ యూనియన్లో సభ్యత్వం లేక పోవడంతో ఈ గొడవకు కారణం. అనుష్క తనకు నచ్చిన మేకప్ మెన్‌ను తెప్పించుకుని... డబ్బులు నిర్మాతతో కట్టిస్తుండటం వారు తట్టుకోలేక పోయారు. చివరకు కార్తి కలుగజేసుకుని గొడవ సద్దుమనిగేలా చేసాడట.
ఈ నేపథ్యంలో చిర్రెత్తిన అనుష్క... ఇకపై మేకప్ మేన్‌ను సొంతం గా మెయింటేన్ చేసుకోవాలని, నిర్మాతలతో సంబంధం లేకుండా తానే మేకప్ మెన్‌ను భరించాలని నిర్ణయించుకుందట. మరి అనుష్క నిర్ణయంపై అరవ మేకప్ మెన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రస్తుతం అనుష్క కార్తి సరసన 'అలెక్స్ పాండ్యన్' చిత్రంలో, ఆర్యతో కలిసి 'బృందావనంలో నందనకుమారుడు' చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా హీరో సూర్యతో 'సింగం-2' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయింది. తెలుగులో ఈ భామ నాగార్జునతో కలిసి 'డమరుకం' చిత్రంలో నటించింది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రభాస్‍తో కలిసి నటించిన వారధి చిత్రం కూడా సంక్రాంతికి విడుదలకు సిద్దం అవుతోంది.


Click it and Unblock the Notifications











