ఆ స్టార్స్ ఇద్దరి కి తెలుగులో తిరస్కారం-తమిళంలో పురస్కారాలా..!?
టాలీవుడ్ లో నాగార్జునతో 'రగడ" మినహా గతేడాది అనుష్క నటించిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.'పంచాక్షరి", 'వేదం" వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.అలాగే, 'హ్యాపీడేస్" తర్వాత తమన్నా నటించిన 'కాళిదాస్", 'కొంచెం ఇష్టం కొంచె కష్టం" చిత్రాలు ఆమె కెరీర్ కు ఏవిధంగానూ హెల్ప్ అవ్వలేకపోయాయి. గతేడాది తమన్నా నటించిన ఒక్క చిత్రమూ విడుదల కాలేదు.
అయితే, ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమిళంలో మాత్రం దూసుకుపోతున్నారు. అంతేకాదు, ఈ ఇద్దరు భామామణులకు తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం 'కళైమామణి" ప్రకటించబడింది. ఈ యేడాది చిత్రరంగానికి సంబంధించి ఈ బిరుదు అనుష్క, తమన్నాను వరించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 13న చెన్నైలోని వల్లూవర్ కోటమ్ లో జరిగే వేడుకలో ఈ అవార్డులను అనుష్క, తమన్నా అందుకోనున్నారిని సమాచారం. అనుష్క తమిళంలో ఇప్పటివరకు రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించగా, తమన్నా ఓ అయిదారు సినిమాల్లో నటించి ఉంటుంది. కాగా ఇప్పటివరకు ఎంతో సీనియారిటీ ఉన్న హీరోయిన్లకు, నటీమణులకు మాత్రమే ఇస్తూ వస్తున్న 'కళైమామణి" పురస్కారాలను రెండు మూడు సినిమాల్లో నటించినవారికి కూడా ఇచ్చేస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది..


Click it and Unblock the Notifications











