»   » తమన్నా బాగా పెంచేయటంతో అనుష్క కే ఆఫర్స్

తమన్నా బాగా పెంచేయటంతో అనుష్క కే ఆఫర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమన్నాతో "ఆవారా" చిత్రం చేసిన లింగు స్వామి తన తదుపరి చిత్రం వెట్టై(వేట)కి కూడా ఆమెనే తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అమాంతంగా తన రెమ్యునేషన్ ని 1 కోటి 20 లక్షల రూపాయలు పెంచేయటంతో అంతా అదిరిపడ్డారు. లింగు స్వామి ఆమె కన్వీన్స్ చేయాలని చూసినా తమన్నా ససేమిరా అంది. దాంతో లింగు స్వామి కన్ను అనుష్కపై పడింది. ఆమెను తన ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా ఆర్య, మాధవన్ హీరోలుగా రూపొందనున్న ఈ చిత్రంలో ఆర్య సరసన అనుష్క ని ఫైనల్ చేసారు. ఇక తెలుగు వెర్షన్ లో ఆర్య పాత్రను మహేష్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. అలాగే అనుష్క..విక్రమ్ సరసన కూడా చేస్తోంది. విజయ్ అనే దర్శకుడు రూపొందించుతున్న చిత్రంలో అనుష్క ని హీరోయిన్ ఎన్నుకున్నారు. మరో ప్రక్క అనుష్క...వేదం తమిళ రీమేక్ వానమ్ లోనూ వేశ్య పాత్ర చేస్తోంది. అలా తమిళంలో ఆమె బిజీ అవుతోంది. ఇది తమన్నాకు మింగుడు పడని అంశమే.

Please Wait while comments are loading...