ఆ సీక్వెల్ కి అనుష్క గ్రీన్ సిగ్నల్
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రం 'యముడు'. అనూష్క,సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి హరి దర్సకత్వం వహించారు. తమిళంలో సింగం టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం హిందీలోకి సైతం రీమేక్ అయ్యింది. అజయ్ దేవగన్,కాజల్ కాంబినేషన్ లో అక్కడ కూడా చిత్రం బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి రెండో భాగం చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు హీరో సూర్య సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి భాగం రూపొందించిన హరికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కథ పూర్తిగా సిద్ధమైంది. ఇందులోనూ హీరోయిన్ గా నటించేందుకు అనుష్క అంగీకారం తెలిపింది.
అలాగే సంగీతం ను దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తారు. అలా మొదటి చిత్రానికి పనిచేసిన టీమ్ మొత్తం ఈ 'యముడు 2'కి పనిచేయటానికి రెడీ అవుతున్నారు. సూర్య కూడా సెవెంత్ సెన్స్ చిత్రం ఊహించిన విధంగా వర్కవుట్ కాకపోవటంతో మరో కమర్షియల్ సక్సెస్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. దానికి సీక్వెల్ సరైన మార్గం అని ఫిక్సయ్యాడని తమిళ పత్రికలు అంటున్నాయి. అందులోనూ అనూష్కకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఆమెకు తెలుగులో ఆఫర్స్ లేవు. కేవలం నాగార్జున సరసన ఢమురకం లో మాత్రమే చేస్తోంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. దాంతో ఆమె దృష్టి ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ స్టేజికి వెళ్లాలనే ఉంది.


Click it and Unblock the Notifications











