»   » విశ్రాంతి కోరుకొంటున్న అనుష్క.. అందుకోసమేనా?

విశ్రాంతి కోరుకొంటున్న అనుష్క.. అందుకోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత అనుష్కకు ఒక్కసారిగా లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ వచ్చింది. అరుంధతితో మంచి నటిగా ప్రూవ్ చేసుకొన్న అనుష్క ఆ తర్వాత గ్లామర్ తారగానూ మెప్పించింది. బాహుబలి తర్వాత వచ్చిన భాగమతితో కూడా హిట్ కొట్టేసింది. వెంట వెంటనే సినిమాలు జోష్ ఆమెలో కనిపించలేదు. ప్రస్తుతం సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నది. ఎందుకంటే..

చేతిలో ఒకే సినిమా..

చేతిలో ఒకే సినిమా..

భాగమతి తర్వాత ప్రస్తుతం అనుష్క చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నది. ఆ సినిమా పట్టాలపైకి ఎక్కేలోపు సినిమాలకు బ్రేక్ చెప్పింది.

 గౌతమ్ మీనన్ కోసం

గౌతమ్ మీనన్ కోసం

దర్శకుడు గౌతమ్ మీనన్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్, మార్కెట్ ఉంది. ఏం మాయ చేశావే, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాలు ఆయన మార్కెట్‌ను పెంచాయి. ఎన్నై అరిందల్ చిత్ర పూర్తయిన తర్వాత అనుష్క సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

సమయం దొరకడంతో అనుష్క..

సమయం దొరకడంతో అనుష్క..

గౌతమ్ సినిమా ప్రారంభానికి కాస్త సమయం దొరకడంతో అనుష్క సన్న పడేందుకు ప్రయత్నాలు చేస్తుందట. సైజ్ జీరో, బాహుబలి కోసం బాగా లావెక్కిన అమ్మడు కాస్తా బొద్దుగా కనిపించిన మాట వాస్తవమే.

English summary
After doing an epic fantasy ‘Baahubali,’ and spooky film ‘Bhaagmathie’, Anuskha Shetty is set to return to regular mainstream films. Anuskha is reportedly committed to work with ace Tamil director Gautam Menon in his next. Perhaps, it is taking time to go on the sets, hence, the actress has taken a break,” adds the source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X