Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వేలైక్కరన్ భేష్.. సెన్సార్ అధికారుల ప్రశంస.. ఒక కట్ లేకుండా క్లీన్ చిట్
Recommended Video
తని ఒరువన్ చిత్రం తర్వాత సామాజిక అంశంతో డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్న చిత్రం వేలైక్కరన్. ఈ చిత్రంలో శివకార్తీకేయన్, ఫహద్ ఫాజిల్, నయనతార నటిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిలిం సర్టిఫికెట్ కోసం ఈ చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తిని శ్యక్తి చేసి ఎలాంటి కట్ లేకుండా యూ సర్టిఫికెట్‌ను జారీ చేయడం విశేషం.
సామాజిక సందేశంతో
తని ఒరువన్ చిత్రం మాదిరిగానే సామాజిక సందేశంతోపాటు మంచి కమర్షియల్ చిత్రంగా వేలైక్కరన్ రూపొందింది. వైద్యరంగంలో చోటుచేసుకొంటున్న లోపాలు, వైద్య వృత్తిలో మాఫియా అంశాల ఆధారంగా వేలైక్కరన్ సినిమాను తెరకెక్కించారు. అలాంటి చిత్రంపై సెన్సార్ బోర్డు అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఆహార కల్తీ కథానేపథ్యంగా
ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై మురికివాడల ప్రజలు సాగించిన పోరాటమే వేలైక్కరన్ చిత్ర కథ. ఈ చిత్రాన్ని అణగారిన ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
వ్యాపార ప్రకటనలో నటించను
వేలైక్కరన్ చిత్ర ప్రభావంతో హీరో శివకార్తీకేయన్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. ఇక నుంచి తాను వ్యాపార ప్రకటనల్లో నటించను అని ఆయన ప్రకటన చేశారు. ఆహార పదార్థాల గురించి తప్పుడు సమాచారం ఇచ్చే అంశాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించడం గమనార్హం. అలాంటి వ్యాపార ప్రకటనలు చూసి మోసపోకుండా అవగాహన పెంచడం కోసమే ఈ సినిమా తీశామని శివకార్తీకేయన్ వెల్లడించారు.
నటీనటులు, సాంకేతిక వర్గం
వేలైక్కరన్ చిత్రంలో నయనతార, స్నేహ, ప్రకాశ్ రాజ్, ఆర్జే బాలాజీ, సతీష్, రోహిణి తదితరలు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మించారు.