విజయ్, మహేష్ బాబులను కాదని.. మరో హీరోని టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల్లో ఒకరైన ఏఆర్.మురగదాస్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా చేసిన వెంటనే విజయ్ తో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేసినప్పటికీ ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అలాగే మహేష్ బాబు కోసం కూడా ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్పాడు.

విజయ్ మాస్టర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మురగదాస్ విజయ్ తో ఆ సినిమా తరువాత కొత్త సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే.. మధ్యలో కమల్ హాసన్ చేరినట్లు టాక్ వస్తోంది. త్వరలోనే రెగ్యులర్ పాలిటిక్స్ లో బిజీ కానున్న కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతో పాటు మరో మంచి సందేశాత్మక సినిమాను వెంటనే పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

Ar muragadoss plan changed and upcoming project with kamal hasan

అందుకే మురగదాస్ లైన్ లోకి వచ్చి మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ఒక స్టోరీని రెడీ చేసుకున్నట్లు టాక్. అందుకోసమే ప్రస్తుతానికి మహేష్ బాబు, విజయ్ తో చేయవలసిన కథలను పక్కన పెట్టినట్లు సమాచారం.

గతంలో మహేష్ బాబుతో మురగదాస్ స్పైడర్ సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఈ సారి అలా కావద్దని కమర్షియల్ ఫార్మాట్ లోనే మంచి కథను రెడీ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మురగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X