రూమర్స్ ఆపండి: ‘సర్కార్’ స్టోరీ వివాదంపై మురుగదాస్ ఏమన్నారంటే...
విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' మూవీ దీపావళికి విడుదలవుతుండగా.... సినిమా స్టోరీపై కాపీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ స్టోరీ తనదే అంటూ కోర్టుకెక్కిన వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్ తనకు టైటిల్ క్రిడిట్‌తో పాటు రూ. 30 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Recommended Video

ఈ రోజు మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగాల్సి ఉండగా.... కోర్టు బయటే మురుగదాస్, సన్ పిక్చర్స్ వరుణ్ రాజేంద్రన్‌తో కాంప్రమైజ్ అయ్యారు. టైటిల్ క్రెడిట్ ఇవ్వడానికి మురుగదాస్ అంగీకరించారు.
ఆ పాయింట్ మాత్రమే సేమ్
అయితే వరుణ్ రాజేంద్రన్‌కు టైటిల్ క్రెడిట్ ఇచ్చిన అనంతరం 30 సెకన్ల నిడివిగల మెసేజ్ ఒకటి మురుగదాస్ ప్లే చేస్తారని సమాచారం. ఓట్ల దుర్వినియోగంకు సంబంధించి ఒక చిన్న పాయింట్... సర్కార్ సినిమాలో, వరుణ్ రాసుకున్న సెంగోల్‌లో సేమ్ ఉందని, అంతే కానీ ఈ రెండు సినిమల కథకు ఏ మాత్రం సంబంధం లేదని ఇందులో వెల్లడిస్తారని తెలుస్తోంది.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నేనే: మురుగదాష్
‘సర్కార్' సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తానే అని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని మురుగదాస్ ఓ వీడియోలో స్పష్టం చేశారు. తాము ఎవరి కథను దొంగిలించలేదని, రూమర్లకు తెర దించాలని కోరారు. ఎన్నో నెలలు కష్టపడి ఈ కథ రాసుకున్నట్లు తెలిపారు. అయితే ఓటు దుర్వినియోగం గురించిన ఓ పాయింట్ విషయంలో ఇద్దరి ఆలోచన ఒకేలా ఉండటం, తనకంటే ముందే అతడి కథ రిజిస్టర్ అవ్వడం వల్ల రాజేంద్రన్‌కు థాంక్స్ కార్డ్ వేయనున్నట్లు మురుగదాస్ తెలిపారు.

కాపీ వివాదం తలెత్తడానికి కారణం అదే
‘సర్కార్' మూవీలో విజయ్ ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. ఓటు వేయడానికి ఇండియా వచ్చిన అతడు... తన ఓటు అప్పటికే ఎవరో వేయడం చూసి విస్మయపోతాడు. తన ఓటు దుర్వినియోగం కావడం వెనక రాజకీయ పార్టీల హస్తం ఉందని తెలిసి ఫైట్ చేస్తాడు. ఇలా ఓటు దుర్వినియోగానికి సంబంధించిన పాయింట్ ఒకేలా ఉండటంతో వివాదం తలెత్తింది.

సర్కార్
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘సర్కార్' మూవీలో విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి, యోగి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దీపావళి సందర్బంగా నవంబర్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











