ఆ తెలుగు రీమేక్ తో మురగదాస్..మళ్లీ హిందీకి
గజనీ హిందీ రీమేక్ తో రికార్డులు సృష్టించిన దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ తాజాగా కిక్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారని వినపడుతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోగా సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా దీపికా పదుకొణె ని అడిగుతున్నారు. ఇక ఈ సినిమా హిందీ హక్కుల్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా పొందారు. ఆయనే మురగదాస్ ని డైరక్ట్ చేయమని సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందించేందుకు మురుగ సన్నాహాలు చేసుకొంటున్నారు. దాంతో ఈ చిత్రాన్ని మురగదాస్ డైరక్ట్ చేయటానికి ముందుకొస్తారా అనేది సందేహమేనంటున్నారు. అయితే ప్రభుదేవా కూడా ఈ నిర్మాత లిస్ట్ లో ఉన్నారు. సల్మాన్ ఖాన్ తో పోకిరీ హిందీ వెర్షన్ వాంటెడ్ రూపొందించి హిట్ అనిపించుకున్న ఆయన కూడా కిక్ ని డైరక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
More from Filmibeat
గజనీ మురగదాస్ సల్మాన్ ఖాన్ దీపిక్ పడుకొనే కిక్ రవితేజ ఇలియానా సురేంద్రరెడ్డి వాంటెడ్ పోకిరి ghajini muragadoss salman khan deepika padukone kick ravi teja ileana


Click it and Unblock the Notifications











