twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్బార్ డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. రక్షణ కల్పించమని కోర్టును ఆశ్రయించిన దర్శకుడు

    |

    సంక్రాంతి బరిలోకి దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మంచి విజయమే లభించింది. అయితే దర్బార్ సినిమా బాగానే ఆడినా.. వాటికి మాత్రం లాభాలు రాలేదని తెలుస్తోంది. సినిమాను భారీ రేటుకు అమ్మడంతో చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారం తమిళ నాట పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

    భారీ హైప్‌తో..

    భారీ హైప్‌తో..

    విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రజినీకాంత్ మొట్టమొదటి కాంబినేషన్ కావడం, టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి. అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ చేసిన దర్బార్.. వసూళ్ల పరంగా మాత్రం గట్టించలేకపోయిందని సమాచారం.

    ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు..

    ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు..

    రజినీ సినిమా అంటే కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఖండాంతరాల్లో కూడా దాని హవా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసిన దర్బార్ మొదటి రోజే దాదాపు వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు ప్రకటించారు. అయితే వసూళ్లలు బాగానే వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కకపోవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    మొత్తంగా 250కోట్ల గ్రాస్..

    మొత్తంగా 250కోట్ల గ్రాస్..

    తమిళ నాట దర్బార్‌కు పోటీ లేకపోవడం కలిసి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు, అల వైకుంఠపురములో రెండూ పోటా పోటీగా ఉండటంతో అంతగా కలిసి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు సమాచారం. అయితే లెక్కలు మాత్రం ఇలా ఉంటే రియాల్టీలో పరిస్థితి వేరేలా ఉంది.

     కలెక్షన్లలో సగం రజినీకే..

    కలెక్షన్లలో సగం రజినీకే..

    దర్బార్ సినిమా ఎంత కలెక్ట్ చేసినా.. రజినీ రెమ్యూనరేషన్ వాటానే కళ్లు బయర్లు కమ్మేలా ఉందని టాక్. తలైవా దాదాపు వంద కోట్లకు పైగా పారితోషికంగా తీసుకున్నాడని టాక్. ఇక సినిమా వసూళ్లు కూడా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేలా లేవని తెలుస్తోంది.

    డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన..

    డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన..

    దర్బార్ చిత్రాన్ని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలనే మిగిల్చింది. అన్ని ఏరియాల్లో భారీ రేటుకే దర్బార్ అమ్ముడు పోయింది. అయితే ఆ మేర కలెక్షన్లు మాత్రం లేవని తాము నష్టాలను భరించాల్సి వస్తుందని ఎంతో కొంత పరిహారం ఇప్పించాలని ఆందోళన చేస్తున్నారు.

    రక్షణ కల్పించమని..

    రక్షణ కల్పించమని..

    ఈ క్రమంలో ఈ రోజు ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి సినిమా పంపిణీదారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. మరోవైపు, పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.

    English summary
    Rajinikanth Darbar In Loss Tamilanadu Distributers Are In Worry. AR Murugadoss Seeking Protection From Darbar Distributers. This Movie Is Directed By AR Murugadoss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X