మరో వండర్ క్రియేట్ చేయబోతున్న ఏఆర్.మురగదాస్.. ఏకంగా కింగ్ కాంగ్ మూవీ ?

తమిళ చిత్ర పరిశ్రమలో శంకర్ తర్వాత భారీ ప్రయోగాత్మకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కమర్షియల్ సినిమాలతోనే మంచి సందేశాలను అందించే ప్రయత్నం చేసే మురగదాస్ తో ఒకప్పుడు సినిమా చేయాలని అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకూ చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఒకప్పుడు వర్క్ చేసిన హీరోలు కూడా వెనకడుగు వేస్తున్నారు. విజయ్, ఏఆర్ మురుగదాస్ ప్రయాణం ఒకప్పుడు చాలా దగ్గరగానే కొనసాగింది. ఒక హీరో దర్శకుడు అని కాకుండా మంచి స్నేహితులుగా కనిపించారు.

అయితే ఎప్పుడైతే మురుగదాస్ స్పైడర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు. మహేష్ బాబుకి అయితే ఆ సినిమా కోలుకోలేని దెబ్బ వేసిందనే చెప్పాలి. కేవలం మహేష్ బాబు పై మాత్రమే కాకుండా మురుగదాస్ మార్కెట్ పై కూడా ఎంతగానో ప్రభావం చూపించింది. ఆ తర్వాత మిగతా అగ్ర హీరోలు కూడా మురుగదాస్ తో సినిమా చేయాలి అనే ఆలోచనను ఒక్కసారిగా మార్చేసుకున్నారు. ఇక ఆ కష్ట సమయంలో మళ్లీ విజయ్ మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అప్పుడు వారి కాంబినేషన్లో సర్కార్ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ విజయ్ అయితే అనుకున్నంత స్థాయిలో సంతృప్తి చెందలేదట.

Ar Murugadoss upcoming fantasy action film in pan india

ఆ సినిమా తర్వాత రజనీకాంత్ ప్రత్యేకంగా మురుగదాస్ ను పిలిచి దర్బార్ అనే కథను సిద్ధం చేయించాడు. ఎన్నో ఏళ్ల నుంచి తలైవా తో సినిమా చేయాలని అనుకుంటున్న మురగదాస్ అప్పట్లో ఆ సినిమాను జెట్ స్పీడ్ లో పూర్తి చేశాడు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ దెబ్బతో మురుగదాస్ క్రేజ్ తగ్గిపోవడంతో అతనితో సినిమా చేయాలని అనుకున్న మిగతా హీరోలు ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆ లిస్టులో విజయ్ కూడా ఉన్నాడు.

చేసేదేమీలేక మళ్ళీ తెలుగు హీరోలు పైన ఫోకస్ పెట్టాలని అనుకున్నప్పటికీ ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు. బిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ హీరోలు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. అయితే పెద్ద హీరోల వైపుకు వెళ్లకుండా ఈసారి ఏకంగా ఒక వింత జీవితో ప్రయోగం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కింగ్ కాంగ్ తరహాలో భారీ క్యారెక్టర్ ను క్రియేట్ చేసే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి నాలుగు భాషల్లో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మురుగదాస్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. త్వరలోనే అఫీషియల్ గా ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మురగదాస్ గతంలో మాదిరిగా భారీ సక్సెస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X