భార్యపై ‘గృహలక్ష్మీ’ కస్తూరి నోటి దురుసు.. ఏఆర్ రెహ్మాన్ దిమ్మతిరిగే జవాబు ఏమిటంటే?
గృహలక్ష్మీ సీరియల్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న కస్తూరి అత్యంత వివాదాస్పదంగా కనిపిస్తారు. పలువురు ప్రముఖులపై కామెంట్లు చేస్తూ వివాదాల్లో చిక్కుకొంటారు. ఆమె ముక్కు సూటి తనం వల్లో లేక నోటి దురుసుతనం వల్లో ఆమె నిత్యం మీడియాలో కాంట్రవర్సీగా కనిపిస్తుంటారు. అయితే మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో హైలెట్‌గా మారాయి. తాజాగా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ భార్యపై కస్తూరి చేసిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే కస్తూరి కామెంట్‌పై రెహ్మాన్ ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు ఏమిటంటే?
పొన్నియన్ సెల్వన్ 2కు భారీ రెస్పాన్స్ : ఏఆర్ రెహ్మాన్ చాలా రోజుల తర్వాత మంచి జోష్‌తో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన సంగీతం సమకూర్చిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆయన అందించిన బీజీఎంకు భారీ రెస్పాన్స్ వస్తున్నది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో పలు సన్నివేశాలను రెహ్మాన్ తన సంగీతంతో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడనే మాట వినిపిస్తున్నది.

అవార్డుల ఫంక్షన్‌లో ఏఆర్ రెహ్మాన్ భార్య : ఇదిలా ఉండగా, ఏఆర్ రెహ్మాన్ ఇటీవల తన భార్య సైరా బానుతో ఓ అవార్డు ఫంక్షన్‌కు వెళ్లారు. అవార్డు ఫంక్షన్‌లో సైరాబానును హోస్ట్ తమిళంలో అడిగిన ప్రశ్నకు ఆమె హిందీలో సమాధానం ఇచ్చారు.అప్పుడు ఏఆర్ రెహ్మాన్ తమిళంలో సమాధానం ఇవ్వాలని సూచించాడు. నాకు తమిళంలో అనర్గళంగా మాట్లాడలేను అని చెప్పి ఇంగ్లీష్‌లో ముగించేసింది.
తమిళంలో మాట్లాడలేవా? అంటూ కస్తూరి : అయితే అవార్డులో సైరాబాను తమిళంలో మాట్లాడలేదనే విషయంపై గృహలక్ష్మీ ఫేమ్ కస్తూరి ట్విట్టర్‌లో స్పందించారు. ఏఆర్ రెహ్మాన్ తమిళంలో మాట్లాడలేదా? వాళ్ల మాతృభాష ఏమిటి? ఇంట్లో వాళ్లు ఏ భాషలో మాట్లాడుకొంటారు? అని కస్తూరి ట్వీట్ చేసింది. దాంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలోవైరల్ అయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.

ఏఆర్ రెహ్మాన్ సమాధానం ఏమటంటే? : తన భార్య సైరాబానుపై కస్తూరి చేసిన కామెంట్లపై ఏఆర్ రెహ్మాన్ చాలా సున్నితంగా స్పందించాడు. కస్తూరి మాటలకు పెద్దగా రియాక్ట్ కాకుండా సింపుల్‌గా ప్రేమకు గౌరవం ఇవ్వండి అని ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. రెహ్మాన్ ఇచ్చిన సాఫ్ట్ టచ్‌కు కస్తూరికి ఎక్కడ తగలాలో అక్కడే గట్టిగానే తగిలినట్టు అనిపించింది.అయితే రెహ్మాన్ ఇచ్చిన ట్వీట్ రిప్లైపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

రెహ్మాన్ ఇచ్చిన డోస్‌పై నెటిజన్లు : గృహలక్ష్మీ కస్తూరికి ఏఆర్ రెహ్మాన్ ఇచ్చిన డోస్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. తలైవా మంచి మాస్ రిప్లై ఇచ్చావు. లవ్లీ రిప్లై, తలైవా అలాంటి నెగిటివిటినీ పట్టించుకోకు అని కొందరు అన్నారు. అయితే తమిళం రాకపోతే ప్రేమించ వద్దా? ప్రతీ ఒక్కరు హిందీ,ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడాలి. నాన్ తమిళ్స్ డబ్బు సంపాదించడం లేదా? అని ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











