మరోసారి ఆస్కార్ బరిలో ఎఆర్ రెహమాన్

By Srikanya

ప్రముఖ సంగీత దర్శకుడు ‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ మరోసారి ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలబడనున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ దర్శకుడు డానీ బోయెల్‌ తీసిన '127 అవర్స్‌' చిత్రానికి రెహమాన్‌ మ్యూజిక్‌ అందించారు. ఇందులోని 'ఇఫ్‌ ఐ రైజ్‌' అనే పాట, ఓరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డుకు పోటీ పడనుంది. మొత్తం 41 పాటలు ఆస్కార్‌ పురస్కారం కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో అత్యధిక నామినేషన్లు పొందిన మొదటి ఐదు పాటల్ని, ఫైనల్స్ కు సిద్ధం చేస్తారు. ఫైనల్‌ టాప్‌ 5 నామినేషన్‌కు ఎంపికయ్యే జాబితా జవవరి 6న అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌వారు ప్రకటిస్తారు.

అకాడమీ అధికార వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలన్నీ గురువారం పొందుపర్చారు. గత సంవత్సరం 'కపుల్స్‌ రిట్రీట్‌' అనే చిత్రంలోని ఓ పాట కూడా ఆస్కార్‌ పోటీలో నిలిచింది. వరుసగా మూడోసారి ఆస్కార్‌ ఆవార్డుల పోటీలో రెహమాన్‌ నిలబడ్డారు. తాజా చిత్రం '127 అవర్స్‌' ఆరాన్‌ రాల్‌స్టన్‌ అనే పర్వాతారోహకుడి నిజ జీవిత కథ. 83వ ఆస్కార్‌ అవార్డుల ప్రకటన జనవరి 25న వెలువడుతుంది. అవార్డుల బహూకరణ ఫిబ్రవరి 27న హాలీవుడ్‌లోని కొడాక్‌ థియేటర్‌లో జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X