ఏఆర్ రెహమాన్ ,యవన్ శంకర్ రాజా కలిసి...
చెన్నై : స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, యువ సంగీత సంచలనం యువన్‌శంకర్ రాజా ఒకే చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు. అయితే స్వరాలు సమకూర్చటంలో కాదు.
మరి ఏ విషయంలోనంటారా? ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మాణంలో ధనుష్ హీరోగా భరత్‌బాలా తెరకెక్కిస్తున్న చిత్రం 'మరియాన్'. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
ఈ సినిమా కోసం ధనుష్ ఓ పాట రాశాడు. దాన్ని యువశంకర్ రాజా ఆలపించాడు. గతంలో తన సంగీత సారథ్యంలోనే ధనుష్‌కు చాలా పాటలు పాడిన యువన్ తొలిసారిగా మరొకరి సంగీతంలో గళంవిప్పాడు.
అలా స్వరమాంత్రికుడితో జట్టు కట్టాడు. వారి కలయికలో రూపొందిన ఈ పాట జనాల్ని విశేషంగా అలరిస్తుందని దర్శకుడు భరత్‌బాలా ధీమా వ్యక్తం చేశాడు. ఈ పాట ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












