twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టు నోటీసులు.. భారీగా పన్ను ఎగవేత అంటూ..

    |

    ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు పన్ను ఎగవేత కేసులో మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా తన ఫౌండేషన్‌కు నిధులు మళ్లింపు చేశారనే ఆరోపణలు రెహ్మాన్‌పై రావడం గమనార్హం. దీంతో ఆయన ఓ వివాదంలో ఇరుక్కొన్నారు. అయితే రెహ్మాన్ ఈ నోటీసుల గురించి ఇంకా స్పందించలేదు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...

    ఏఆర్ రెహ్మాన్‌కు బ్రిటన్ నుంచి నిధుల మళ్లింపు

    ఏఆర్ రెహ్మాన్‌కు బ్రిటన్ నుంచి నిధుల మళ్లింపు

    సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన పేరిట ఏఆర్ రెహ్మాన్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థను 2009లో స్థాపించారు. ఆర్థికంగా వెనుకబడిన బాలలు, అనాథ పిల్లలకు సహాయం అందించే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. వారికి పిల్లలకు మ్యూజిక్, ఎడ్యుకేషన్, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి విరాళాలు సేకరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.

    బ్రిటన్ మొబైల్ కంపెనీకి రింగ్ టోన్ చేసి..

    బ్రిటన్ మొబైల్ కంపెనీకి రింగ్ టోన్ చేసి..

    2015లో బ్రిటన్‌కు చెందిన ఓ మొబైల్ కంపెనీ కోసం రింగ్‌ టోన్ పాటను ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేశారు. అందుకు గాను సదరు కంపెనీ ఏఆర్ రెహ్మన్ ఫౌండేషన్‌ను నిధులను మళ్లించింది. అయితే ఫారీన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ నిబంధనలకు అనుగుణం నిధుల మళ్లింపు జరుగలేనే వాదన ఐటీ అధికారులు లేవనెత్తారు.

    చెన్నై ఐటీ శాఖ సవాల్..

    చెన్నై ఐటీ శాఖ సవాల్..

    ఏఆర్ రెహ్మాన్‌ ఫౌండేషన్‌కు విదేశీ నిధుల మళ్లింపు వివాదం ఇన్‌కం టాక్స్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. ఈ వివాదంలో చెన్నైలోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్‌ సానుకూలంగా తీర్పు నిచ్చారు. అయితే ఆ తీర్పును ఐటీ డిపార్ట్‌మెంట్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

    3 కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేత

    3 కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేత


    ఈ క్రమంలో ఏఆర్ రెహ్మాన్ ఫౌండేషన్‌ పన్ను ఎగవేతకు పాల్పడిందంటూ తాజాగా మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రిటన్ కంపెనీ నుంచి రూ.3.47 కోట్ల మేర నిధులు మళ్లించారు. ఈ నిధుల మళ్లింపు విషయంలో పన్ను చెల్లించలేదు అంటూ మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

    Recommended Video

    Sushant Singh Rajput Fans Demand #DilBecharaOnBigScreen, AR Rahman Supports
    ఇటీవల కాలంలో రెండోసారి వివాదంలోకి రెహ్మాన్

    ఇటీవల కాలంలో రెండోసారి వివాదంలోకి రెహ్మాన్

    ఏఆర్ రెహ్మాన్ వివాదంలో ఇరుక్కోవడం ఇటీవల కాలంలో రెండోసారి. గతనెలలో బాలీవుడ్‌లో జరుగుతున్న నెపోటిజం, ఫేవరిటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర పన్నారనే ఆరోపణలు చేయడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. అనంతరం ప్రస్తుతం పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటూ మరోసారి వివాదంలో కూరుకుపోయారు.

    English summary
    A R Rahman Oscar winning music composer AR Rahman gets notice from Madras High Court for a evading income tax on rupees 3.47 crores which he received as a payment from UK based mobile company & was transferred to his foundation without tax deduction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X