2.0 క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్.. గ్రాఫిక్స్ లేకుండానే పాట అదిరింది.. రెహ్మాన్
బాహుబలి తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆ రేంజ్‌లో చర్చ జరుగుతున్న చిత్రం రోబో సీక్వెల్ 2.0. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 29న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఏఆర్ రెహ్మన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ 2.0 చిత్రం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

శంకర్ తప్ప మరొకరు తీయలేరు
2.0 చిత్రాన్ని శంకర్ తప్ప మరొకరు తీయలేరు. ఈ ప్రాజెక్ట్‌కు అతనే కరెక్ట్ పర్సన్. తాను అనుకొన్నట్టు సినిమాను తెరకెక్కించడంలో శంకర్ ఓ ఉక్కు మనిషిలా కనిపించాడు. క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చాలా సార్లు చెప్పారు అని రెహ్మాన్ వెల్లడించారు.

3డీ పాట మైండ్ బ్లోయింగ్
2.0 చిత్రాన్ని ఇటీవల 3డీలో ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా ఆ సినిమాలోని ఒకపాట చూశాను. అది మైండ్ బ్లోయింగ్. కేవలం శంకర్ మాత్రమే తీయగలరు. క్లైమాక్స్ సీన్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది. వెండి తెర మీద అద్భుతం అని ఏఆర్ రెహ్మాన్ అన్నారు.

శంకర్‌ను ప్రతీ ఒక్కరూ
2.0 సినిమా చూసిన తర్వాత శంకర్‌ను ప్రతీ భారతీయుడు ప్రశంసలతో ముంచెత్తుతారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ పోటిపడి నటించారు. దక్షిణాదిలో ఇప్పటి వరకు 2.0 ఉత్తమ సాంకేతిక విలువలున్న చిత్రంగా మిగిలిపోతుంది అని రెహ్మన్ పేర్కొన్నారు.

400 కోట్లతో 2.0 మూవీ
దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్‌తో 2.0 రూపొందుతున్నది. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ చిత్ర టీజర్ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











